బెంగాల్ జూనియర్ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య కేసును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకోవాలని ఏపీ పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి శైలజానాథ్ అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతున్న తీరును చూస్తే బాధేస్తోందన్నారు.
నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని, ఇలాంటి వాటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపేక్షించొద్దని కోరారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకురావాలన్నారు. అంతేకాదు మహిళా డాక్టర్లకు తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.