ఏపీలోని అనకాపల్లి జిల్లాలో విషాద ఘటన జరిగింది. కోటవురట్ల మండలం కైలాసపట్నంలో అనాథ పాఠశాల ఉంది. అక్కడ ఆదివారం ఉదయం విద్యార్థులు తిన్న ఆహారం ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. విద్యార్థులను టీచర్లు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంలో నలుగురు విద్యార్థులు చనిపోయారు. దీనిపై అధికారులు విచారణకు ఆదేశించారు.