ప్రముఖ విద్యుత్తు ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్లు సోమవారం అప్పర్‌సర్క్యూట్‌ను తాకింది. ఎన్‌ఎస్‌ఈలో 9.99 శాతం పెరిగి రూ.146.38 వద్ద ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని నమోదు చేసింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.64,565.73 కోట్లకు చేరింది. పలు బ్రోకరేజీ సంస్థలు ఈ స్టాక్‌పై సానుకూల వైఖరి వ్యక్తం చేసిన నేపథ్యంలోనే స్టాక్ రాణిస్తోందని ఆర్థిక నిపుణులు వెల్లడించారు.