రాష్ట్ర, జాతీయ రహదారులపై ప్రయాణంలో వాహనమేదైనా.. నిర్దేశించిన గరిష్ఠ వేగ పరిమితికి మించకూడదు. 4లైన్ల రహదారిపై గరిష్ట వేగం 80 కి.మీ అయితే 100-120 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నారు. 6 లైన్ల రహదారిపై గరిష్ట వేగం 100 కి.మీ. 120-130కి.మీ వేగంతో వెళ్తున్నారు. రాష్ట్ర రహదారుల్లో గరిష్ట వేగం 60 కి.మీ. 80-100 కి.మీ వేగంతో వెళ్తున్నారు. నిర్దిష్ట వేగం దాటితే స్పీడ్‌గన్స్ ద్వారా జరిమానాలు విధించాలి. అయితే చాలాచోట్ల స్పీడ్‌గన్స్ లేవు.