దేశంలో నిత్యం అఘాయిత్యాలు, అరాచకాలు, హత్యలు, అత్యాచారాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇక ప్రస్తుతం కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో దేశం మొత్తం తీవ్ర ఆందోళనలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీలో ఓ యువతి పట్ల కొందరు యువకులు ప్రవర్తించిన తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. రాత్రి పూట ఒంటరిగా వెళ్తున్న యువతిని రెండు బైక్‌లతో వెంబడించిన ఐదుగురు యువకులు.. ఆమెను తీవ్ర వేధింపులకు గురి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ సమీపంలోని ఆగ్రాలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
ఢిల్లీకి సమీపంలోనే ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ యువతి రాత్రి వేళ ఒంటరిగా స్కూటీపై వెళ్తోంది. అయితే ఒంటరిగా వెళ్తున్న ఆ యువతిని చూసిన కొందరు యువకులు.. ఆమెను వెంబడించారు. వెనుక నుంచి 2 బైక్‌లపై వచ్చిన ఐదుగురు యువకులు.. ఆమెను తీవ్ర వేధింపులకు గురి చేశారు. యువతి స్కూటీకి రెండు వైపులా.. రెండు బైక్‌లను పోనిచ్చిన ఆ యువకులు.. వెనక నుంచి ఆమెను అభ్యకరంగా తాకేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే వారిని గమనించిన ఆ యువతి.. ఒంటరిగా ఉండటంతో ఏమీ చేయలేకపోయింది.
అలాగే తన స్కూటీపై వేగంగా వెళ్లింది. అయితే ఆమెను ఆ యువకులు కొన్ని కిలోమీటర్ల దూరం వరకు వెంబడించడం గమనార్హం. అయితే చివరికి.. ఓ ట్రాఫిక్ పోలీస్ కనిపించడంతో స్కూటీని ఆపిన ఆ యువతి.. జరిగిన విషయం మొత్తాన్ని ఆ పోలీస్‌కు వివరించింది. ఆ యువతి ట్రాఫిక్ పోలీసుకు జరిగిన విషయం చెప్పడంతో ఆ యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. ఇక ఆ యువతిని ఆ యువకులు వెంబడించిన వీడియోలు.. ఆ మార్గంలో వెళ్తున్న కొందరు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం కోల్‌కతా హత్యాచార ఘటన దేశం మొత్తాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న వేళ.. ఇలాంటి ఘటన దేశ రాజధాని సమీపంలో జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే నడిరోడ్డుపై కొందరు యువకులు మహిళను వెంబడిస్తుంటే వారిని ఆపి.. ఆమెను రక్షించేందుకు ఎవరు ముందుకు రాకపోవడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ యువతిని వేధించిన వారిలో ఇద్దరు వ్యక్తుల్ని అరెస్టు చేసినట్లు ఆగ్రా పోలీసులు తెలిపారు.