కెమెరాలను ప్లగ్ పాయింట్లు, అద్దాలు, స్మోక్ డిటెక్టర్లు, ఫొటో ఫ్రేముల్లో పెట్టే అవకాశం ఎక్కువ కాబట్టి వాటిని పరిశీలించండి. చీకట్లో ఫోన్ ఫ్లాష్ లైట్ వేస్తే, రహస్య కెమెరాలు ఆ వెలుతురును ప్రతిబింబిస్తాయి. నెట్వర్క్ స్కానింగ్ అప్లికేషన్ల ద్వారా హోటల్ వైఫైకు అనుమానాస్పద డివైజ్ లు కనెక్ట్ అయ్యాయేమో చూడండి. అలాగే రహస్య కెమెరాల ఇన్ఫ్రారెడ్ లైట్ ను చీకట్లో చాలా సెల్ఫోన్ కెమెరాలు గుర్తిస్తాయి.