మోషన్ క్యాప్చర్ సూట్ ధరించి వర్చువల్ రియాల్టీ హెడ్సెట్ పెట్టుకుని 7 గంటల పాటు నడుస్తూ తాము డిజైన్ చేసిన రోబోకు శిక్షణ ఇస్తే రోజుకు రూ.28,000 వరకు చెల్లించనున్నట్లు టెస్లా తెలిపింది. టెస్లా హ్యూమనాయిడ్ ఆప్టిమస్ అనే రోబోను తయారు చేసింది. సదరు రోబోకు కాలిఫోర్నియాలోని పాలో ఆల్టోలో శిక్షణ ఇచ్చేందుకు ప్రస్తుతం ఉద్యోగులను నియమిస్తోంది. 5'7" & 5'11" ఎత్తు ఉన్న అభ్యర్థులు దీనికి అర్హులు.