శ్రీసిటీలో పరిశ్రమల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఒప్పందాల పేరుతో సీఎం చంద్రబాబు హైడ్రామా చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. శ్రీసిటీలో తమ హయాంలో పరిశ్రమలు ఏర్పాటు కాగా, ఇప్పుడు వాటికి చంద్రబాబు ప్రారంభోత్సవాలు, ఇప్పటికే పనులు మొదలుపెట్టిన కంపెనీలకు శంకుస్థాపనలు, ఎప్పుడో కుదిరిన ఒప్పందాలకు మళ్లీ ఒప్పందాలు చేస్తున్నారని, చంద్రబాబుది ఎప్పుడూ ప్రచార ఆర్భాటమే అని స్పష్టం చేశారు. వేరొకరి కష్టాన్ని తన ఖాతాలో వేసుకోవడం.. అదే ఎప్పటికీ చంద్రబాబు నిస్సిగ్గు వ్యవహారం అని చురకలంటించారు.