చంద్రబాబు అనాలోచిత నిర్ణయాల వల్లే ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు. పోలవరంలో లాభాల కోసమే చంద్రబాబు ఆలోచించారన్న ఆయన, దాని వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. పోలవరం విషయంలో చంద్రబాబు తప్పిదాలే శాపంగా మారాయని, ఇదే విషయాన్ని అంతర్జాతీయ నిపుణుల కమిటీ కూడా తేల్చి చెప్పిందని వెల్లడించారు.