వెలిగొండ పనులు అన్నీ పెండింగ్ పెట్టేసి, ప్రాజెక్ట్ అయిపోయిందని ఏపి ప్రజలని మోసం చేసాడు.రెండో టన్నెల్లో ఏడు కి.మీ. లైనింగ్ పూర్తి చేయలేదు.. నీళ్ళు ఎలా వదులుతారు జగన్ రెండో టన్నెల్లో తవ్విన 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తీసుకొచ్చి మొదటి టన్నెల్ దగ్గర డంప్ చేసావ్.. నీళ్ళు ఎలా వదులుతారు జగన్
రెండో టన్నెల్లో 12 కి.మీ. దగ్గర టన్నెల్ బోరింగ్ మెషీన్ చెడిపోతే, దాన్ని బయటకు తీసుకు రాకుండా, టన్నెల్ లోనే వదిలేసావ్... నీళ్ళు ఎలా వదులుతారు జగన్
రెండో టన్నెల్లో లక్ష క్యూబిక్ మీటర్ల రాతి వ్యర్ధాలు తొలగించకుండా వెళ్లిపోయావ్. ఇది చేయాలంటే 6 నెలలు పడుతుంది... నీళ్ళు ఎలా వదులుతారు జగన్
ఇన్ని పనులు పెండింగ్ పెట్టి, ప్రాజెక్ట్ అయిపోయిందని రాష్ట్ర ప్రజలను మభ్య పెడతావా? ఇలాంటి మోసపూరిత పాలన చేసావు కాబట్టే, నీకు ఏపి ప్రజలు అడ్రస్ లేకుండా చేసారు.