సింహాచలం అప్పన్న స్వామిని రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రికి ఆలయ ఈవో, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కప్పష్టంభం ఆలింగనం, గర్భగుడిలో మంత్రి కొల్లురవీంద్ర ప్రత్యేక పూజలు చేసి.. ఆపై వేదాశీర్వచనం పొందారు. దర్శనానంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. సింహాద్రి అప్పన్న ఎంతో మహిమన్వితం కలిగిన దేముడన్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో చూశామన్నారు. ప్రజల కోరిక మేరకు సంక్షేమ పధకాలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందుకొచ్చారని తెలిపారు. రాష్ట్రంలో ఐదు సంవత్సరాలలో అన్ని వర్గాలు ఇబ్బంది పడ్డారన్నారు. పరిశ్రమలు రాకుండా అడ్డుకున్నారని.. ఉన్న పరిశ్రమల్ని మూసేశారని మండిపడ్డారు.