దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఈ-కామర్స్ సంస్కృతిపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ తరహా సంస్థలు పుట్టుకొస్తుండడాన్ని గొప్ప విజయంగా భావించకూడదని, ఇది ‘ఆందోళన చెందాల్సిన విషయం’ అని పేర్కొన్నారు. పోటీ నివారించేందుకు అనుసరిస్తున్న ధరల విధానం వల్ల సంప్రదాయ రిటైల్ వ్యాపారాలు దెబ్బతింటున్నాయన్నారు. పెద్ద పెద్ద రిటైలర్ల వల్ల చిన్న రిటైలర్లు కనిపించకుండాపోతున్నారని తెలిపారు.