అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో కాకినాడకు చెందిన చల్లపల్లి హారిక (22) మరణించారు. అనారోగ్యంతో తండ్రి ఐదేళ్ల క్రితం చనిపోయారు. కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆమె ఏడాది క్రితం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో చేరారు. అయితే రాఖీ పండుగకు కాకినాడకు రాగా మరో రెండు రోజులు ఉండాలని ఆమె సోదరులు హరికను కోరారు. అయితే యాజమాన్యం అనుమతించకపోవడంతో నిన్న ఉదయం విధులకు వెళ్లింది. మృత్యువు వెంటాడటంతో ప్రమాదంలో కన్నుమూసింది.