ఈనాం భూముల సాగుదారులకు రికార్డు ప్రకారం పట్టాదారు పాసుపుస్తకాలను అందజేస్తామని చీరాల ఆర్డీవో సూర్యనారాయణ పేర్కొన్నారు. గురువారం బల్లికురవ తహసీల్దార్ కార్యాలయంలో ఈనాం భూముల రికార్డులను పరిశీలించిన అనంతరం సాగు చేస్తున్న చెన్నుపల్లి, కొండాయపాలెం, ముక్తేశ్వరం, మక్కెనవారిపాలెం, కొత్తపాలెం గ్రామాల రైతులతో ఆర్డీవో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అర్డీవో రైతులతో మాట్లాడుతూ 1986లోనే ఈనాందారులకు ఒక వంతు, రైతులకు రెండు వంతుల చొ ప్పున భూములు కేటారుస్తూ రికార్డులో నమో దై ఉందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రికార్డు ప్రకారం పట్టాదారు పాసు పుస్తకాలను అందజేస్తామని అయన తెలిపారు. ఇందుకు రైతులు అభ్యంతరం వ్య క్తం చేస్తు తాము ఎన్నో ఏళ్ల నుంచి భూములు సాగు చేస్తున్నామని ఇప్పుడు ఒక వంతు ఈనాందారులకు ఎలా కేటాయిస్తారని గతం లో కూడా పలు మార్లు సమావేశాలు జరగగా ఇదే విషయం తెలియజేశామని ఆర్డీవో దృష్టికి తీసుకు వచ్చారు. కలెక్టర్ దృష్టికి రైతులు తెలిపిన సమస్యను రికార్డును తీసుకు వెళతామని అయన రైతులతో తెలిపారు. సమావేశంలో ఇన్‌చార్జి తహసీల్దార్ రవికుమార్, వీఆర్వో వీరయ్య పాల్గొన్నారు.