అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో ప్రమాదంపై థర్డ్ పార్టీ కీలక నివేదికలో బయటపడ్డ, గత ప్రభుత్వ అలసత్వం. ప్రమాదం వెనుక యాజమాన్యం, నాటి అధికారుల నిర్లక్ష్యం స్పష్టం.గత ఏడాది ఇచ్చిన రిపోర్ట్ లో, ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ఉన్న అనేక లోపాలను ఎత్తి చూపిన థర్డ్ పార్టీ నివేదిక. కంపెనీలోని పైప్‍లైన్‍ను తనిఖీ చేసే సిస్టమ్ వెంటనే ఏర్పాటు చేయాలని నివేదిక. పైప్‍లైన్ నుంచి రియాక్టర్‌కు వెళ్ళే సాల్వెంట్ లీక్ అయితే, దీనికి పెట్రోల్ కంటే మండే శక్తి ఎక్కువుగా ఉంటుందని, ప్రమాదం జరగవచ్చని హెచ్చరించింది. పైప్‍లైన్‍ను తనిఖీ చేసే సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయాలని థర్డ్ పార్టీ ఇచ్చిన నివేదికని పట్టించుకోని ఎసెన్షియా ఫార్మా కంపెనీ. పైప్‍లైన్‍ను తనిఖీ చేసే సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసే విధంగా థర్డ్ పార్టీ నివేదిక అమలు చేయాలని ఎసెన్షియా ఫార్మా కంపెనీ యాజమాన్యం పై ఒత్తిడి చేయని నాటి జగన్ రెడ్డి ప్రభుత్వం. నేడు అదే విధంగా సాల్వెంట్ లీక్ అయి, రియాక్టర్ పేలి ఇంత ప్రమాదం జరిగింది. థర్డ్ పార్టీ రిపోర్ట్ లో లోపాలు స్పష్టంగా ఉన్నా, నాటి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు