జగన్రెడ్డి అన్న క్యాంటీన్లను మూసేసి పేదల నోటి దగ్గర ముద్దను కొట్టేశారని, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే తిరిగి ముఖ్యంత్రి చంద్రబాబు ప్రారంభించి పేదల మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గురువారం బల్లికురవ మండలం కొమ్మినేనివారిపాలెం గ్రామానికి చెందిన మల్లిపెద్ది హనుమంతరావు అన్నక్యాంటీన్ నిర్వహణకు తన వంతుగా రూ.10వేల నగదును మంత్రికి అందజేసారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుపేదల కడుపు నింపేదుందుకు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లకు విరాళం అందజేసిన హనుమంతురావు దాతృత్వం పలువురికి ఆదర్శనీయం అన్నారు.