మహిళల హక్కులను పరిరక్షిస్తున్న పలు చట్టాలపై కర్నూలు జొహరాపురంలో బుధవారం న్యాయ అవగాహన సదస్సు జరిగింది. కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు, బాలి కలపై లైంగిక వేధింపులను అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మహిళలు, బాలికలు వేధింపులకు గురైతే 100, 181, మహిళల హెల్ప్లైన నెంబర్ 1098లను సంప్రదిస్తే వెంటనే వారి ఇబ్బందులు తొలగించడానికి పోలీసులు కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వనటౌన సీఐ రామయ్య నాయుడు మహిళా పోలీస్ స్టేషన సీఐ గౌస్, ఎస్ఐ నిర్మల, డీసీపీవో శారద, సెయింట్ ఆనస్ పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.