గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు సైతం ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం శ్రీసత్యసాయి విద్యా సంస్థల్లో టీడీపీ యువ నాయకుడు బండారు సంజీవ్ ఆధ్వ ర్యంలో బుధవారం వికాస మెగా జాబ్‌మేళా నిర్వహించింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండారు పాల్గొని నాయకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనలో ఉద్యోగ, ఉపాధి కల్పన పూర్తిగా కుంటి పడటంతో నిరుద్యోగం పెరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లతో కలిపి 20లక్షల ఉద్యోగల కల్పనే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. టీడీపీ నాయకులు బండారు సంజీవ్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కేవీ సత్యనారాయణరెడ్డి, టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృ ష్ణలతో కలిసి ఎమ్మెల్యే బండారు అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈసందర్భంగా వికాస ప్రాజెక్టు డైరె క్టర్ కె.లచ్చారావు, జిల్లా మేనేజర్ జి.రమేష్ మాట్లాడుతూ ఈజాబ్‌మేళాకు 1813మంది నిరుద్యోగులు హాజరయ్యార న్నారు. 42కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఎంపిక ప్రక్రియ చేపట్టగా 711మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. జాబ్‌మేళాను దగ్గర ఉండి పరివేక్షించిన యువ నాయకులు బండారు సంజీవ్‌ను అభినందించారు. వేదికపై నాయకులు సమక్షంలో బండారు సంజీవ్ పుట్టినరోజు కేక్‌ను కట్ చేశారు. నాయకులు గుత్తుల పట్టాభిరామారావు, కంఠంశెట్టి శ్రీనివాస రావు, ముదునూరి వెంకటరాజు, చిలువూరి సతీష్‌రాజు, కరు టూరి నరసింహారావు, ధర్నాల రామకృష్ణ, ఈదల నల్లబాబు, మైగాపుల గురవయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.