విధుల్లో అలసత్వం వహించిన అంగన్వాడీ కార్యకర్త, ఆయాలకు మెమోలు జారీ చేసినట్లు గజపతినగరం ఐసీడీఎస్ సూపర్వైజర్ శకుంతల బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తుమ్మికాపల్లి అంగన్వాడీ కార్యకర్త సుభాషిణి, ఆయా రాధలు ఈ నెల 14న మధ్యాహ్నం అంగన్వాడీ కేంద్రం మూసివేసి ఉండడంతో గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పరిశీలించగా.. విధులు ఎగ్గొట్టినట్టు తేలిందని సూపర్వైజర్ తెలిపారు. ఈమేరకు ఇద్దరికీ మెమోలు జారీ చేశామని తెలిపారు. ఇదిలా ఉండగా గత వారంలో తాము రాజకీయ వేధింపులకు గురవుతున్నామని గజపతినగరం, రామన్నపేట, రంగుపురం, కెంగువ అంగన్వాడీలు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. తాజాగా వారంతా తమకు రాజకీయ నాయకుల నుంచి ఎటువంటి ఇబ్బందులు లేవని లిఖిత పూర్వకంగా ఇచ్చారని తెలిపారు.