నెల్లూరు జిల్లా ప్రజలకు దశాబ్ధాల కాలంగా సోమశిల ప్రాజెక్ట్ జీవనాడిగా ఉందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సోమశిల డ్యాం కెపాసిటీని ఎన్టీఆర్ 78 టీఎంసీలకి పెంచారని తెలిపారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాలతో పాటు తమిళనాడు రాష్ట్రానికి నీరందించేలా రూపకల్పన చేశారని గుర్తుచేశారు. జగన్ ప్రభుత్వం ప్రాజెక్టులని నిర్లక్ష్యం చేసిందని.. అది రైతులకి గొడ్డలిపెట్టుగా మారిందన్నారు. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులను గాలికొదిలేసిందని విమర్శించారు. వరదలు, వర్షాలు వచ్చి సాగునీరంతా సముద్రానికి పోయినా చూస్తూ ఉన్నారే తప్ప... ఇతర ప్రాంతాలకి ఆ నీటిని తరలించి దాహర్తిని తీర్చే ప్రయత్నం చేయలేదన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే పట్టించుకోలేదన్నారు.