చిత్తూరు జిల్లాకు ఇద్దరు కొత్త డీఎస్పీలు వచ్చారు. చిత్తూరుకు సాయినాథ్, పలమనేరుకు ప్రభాకర్‌ను నియమిస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే చిత్తూరు ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ విష్ణు రఘువీర్‌ను కాకినాడకు బదిలీ చేశారు. ఎన్నికల ముందు చిత్తూరుకు వచ్చిన డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి వైసీపీకి అనుకూలంగా పనిచేశారనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేసుకోవాలని ఆదేశాలిచ్చింది. నెల్లూరు మహిళా డీఎస్పీగా ఉన్న సాయినాథ్‌ను తాజాగా చిత్తూరు డీఎస్పీగా బదిలీ చేశారు. రాజమండ్రి స్పెషల్ బ్రాంచి డీఎస్పీగా ఉన్న ప్రభాకర్‌ను పలమనేరు డీఎస్పీగా మార్చారు. ఎన్నికల సమయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే కారణంగా అప్పటి పలమనేరు డీఎస్పీ మహేశ్వర్‌రెడ్డిని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. మే 15 నుంచి చిత్తూరు ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ విష్ణు రఘువీర్ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా జరిగిన బదిలీల్లో విష్ణురఘువీర్‌ను కాకినాడ డీఎస్పీగా బదిలీ చేశారు. విష్ణు రఘువీర్ 1991 ఎస్‌ఐ బ్యాచ్‌కు చెందిన అధికారి కాగా.. కొత్తగా వచ్చిన డీఎస్పీలు 1995 బ్యాచ్‌వారు.