శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువకుడు విజయవాడ- హైదరాబాదు రోడ్డులో బుధవారం జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. సారవకోట మండలం కుమ్మరిగుంట గ్రామానికి చెందిన సాధు సంతోష్‌కుమార్ (23) హైదరాబాదులోని ఓ స్టూడియోలో పనిచేస్తున్నాడు. కొత్తగా బైక్ కొనుగోలు చేసిన సంతోష్‌కుమార్... విజయవాడ కనదుర్గమ్మను దర్శించుకొని తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. ఇతడికి తల్లిదండ్రులు ఈశ్వరమ్మ, ఆదినారాయణ ఉన్నారు. విషాదఛాయలు అలముకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa