అచ్యుతాపురం ఎసెన్సియా ఫార్మా కంపెనీ ఘటనపై హై పవర్ కమిటీ వేస్తున్నామని చంద్రబాబు నాయుడు తెలిపారు. పరిశ్రమలతో పాటు ప్రజల భద్రత ముఖ్యమన్నారు. రెడ్ కేటగిరి పరిశ్రమలు తప్పకుండా సేఫ్టీ అడిట్ జరిపించాలని సీఎం హెచ్చరించారు. పరిశ్రమల నిర్వహణపై ఒక ఎంక్వైరీ కమిటీని వేస్తున్నామన్నారు. గత ఐదేళ్లుగా పరిశ్రమలను లూటీ చేశారని.. ఆ కారణంగానే ప్రమాదాలు ఎక్కువయ్యాయన్నారు. నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తప్పవన్నారు. బాధ్యులైన అందరిపైనా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. అధికారుల అలసత్వంపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. కంపెనీ యాజమాన్యం ఇప్పటివరకు అందుబాటులో లేకుండా పోయిందని చెప్పారు. పరిశ్రమలు రావాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని.. అంతకంటే ముందు భద్రత చాలా ముఖ్యమన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు మూకుమ్మడిగా కంపెనీల్లో తనిఖీలు చేయాలన్నారు. పరిశ్రమల్లో తనిఖీల తర్వాత నివేదికలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.