కూలి పని చేసుకుని తల్లి దండ్రులను 17 ఏళ్ళ యువకుడు ఐ ఫోన్ కొనాలని కోరాడు. అయితే తమకు అంత స్తోమత లేదని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని తర్వాత కొంటామని చెప్పారు. అయితే ఆ తల్లి దండ్రులను బెదిరించడానికి ఎలకల మందు పేస్టు తిన్నాడు. తీవ్ర ఆస్వస్ధతకు గురైన అతడిని గుంటూరు ప్రభుత్వా సుపత్రికి తీసుకు వెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఏలూరు ఎన్టీఆర్ కాలనీకి చెందిన బండా రామకృష్ణ (17) పదో తరగతి వరకూ చదివి ప్రస్తుతం మోటారు సైకిల్ మెకానిక్ పనులు నేర్చుకుంటున్నాడు. అతనికి ఒక సోదరి ఉండగా ఇటీవల వివాహం చేశారు. తనకు ఐఫోన్ కొనాలని ఇటీవల కోరాడు. అందుకు తల్లిదండ్రులు కుదరదని చెప్పారు. కొనపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ ఈనెల 13వ తేదీ ఉదయం ఎలకలమందు పేస్టు తినేశాడు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఆసుపత్రి వైద్యులు ఎమ్మెల్సీగా నమోదు చేసి ఏలూరు రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ ఎస్‌ఐ రాజారెడ్డి తన సిబ్బందితో గుంటూరు వెళ్లి మృత దేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.