తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గంలో అధికారిని అని చెబుతూ పలు అంగన్వాడీ కేంద్రాలను నఖిలీ అధికారి తనిఖీ చేశారు. కలెక్టర్ ఆదేశాలతో తనిఖీలు చేస్తున్నానని నమ్మబలికి అంగన్వాడీ సిబ్బందిని అతను భయభ్రాంతులకు గురి చేశాడు. ఈ నెలలోనే 21 కేంద్రాలను ఆయన తనిఖీ చేశాడు. తనతో సెల్ఫీ తీసుకోవాలని ప్రభుత్వ ఆదేశాలని చెప్పి సిబ్బందితో సెల్ఫీలు తీసుకున్నాడు. దీనితో అనుమానం వచ్చిన సిబ్బంది క్షేత్ర స్థాయి సిబ్బందికి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన కొవ్వూరు సీడీపీఓ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. పట్టణ పోలీసలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.