ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు గమనం చురుగ్గా లేదు. వర్షాలు సక్రమంగా లేవు. వరుణుడు ముఖం చాటేయడంతో పంటల సాగుకు ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు ఉన్నారు. చీ రాల నియోజవకవర్గంలో ఇసుక నేలలు ఎక్కు వ. ప్రధాన నీటివనరు కొమ్మమూరుకాలువ. వర్షాధారంతో పాటు బోర్లు, స్పింక్లర్ల ద్వారా కూడా పంటలు పండిస్తుంటారు. కొద్ది రోజులుగా వరుణుడు ముఖం చాటేశాడు. కొమ్మమూరుకాలువకు నీరులేదు. ఈ నేపథ్యంలో బోర్లలోని నీరు కూడా అడుగంటుతుంది. దీం తో ప్రధాన పంటలైన మొక్కజొన్న, మిను ము సాగుచేసేందుకు సిద్ధం చేసిన దుక్కలు ఖాళీ గా ఉనానయి. బోర్లు, స్పింక్లర్లతో సాగుచేసేందుకు ఎంతో కొంత అవాకశం ఉన్న ఆకుకూరలు, కూరగాయలుతో పాటు కొందరు వేరుశనగ సాగు చేశారు. నీటి వసతి ఎంత ఉన్నా, వర్షంతో పైరు తడిస్తే ఆ పంట ఎదుగుదల బా గుంటుంది. వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి. మాగాణి సాగుకు మరికొంత సమ యం ఉంది. ప్రస్తుతం ఆరుతడి పంటలకు, ఆకుకూరలకు వర్షం అవసరం. వరుణుడి కరుణ కోసం రైతన్నలు ఎదురుచూస్తున్నారు.