ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. గురువారం తాళ్లూరు స్థానిక ఎంపీపీ చాంబర్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారులుగా పనులు చేస్తూ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ప్రజావ్యతిరేక విధానాలను పక్కన బెట్టి సీఎం చంద్రబాబు ప్రజాసంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.