తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. దీంతో అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకూ ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే నవంబర్ నెలకు సంబంధించి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300) టికెట్లను ఈనెల 24న ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.