ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ రోజు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు.. రైల్వేకోడూరు మండలంలోని మైసురావారిపల్లెలో గ్రామ సభలో పాల్గొనబోతున్నారు..ఆ తర్వాత అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో దెబ్బతిన్న పులపత్తూరు గ్రామాన్ని పరిశీలించనున్నారు.. రాజంపేట మండలంలోని పులపత్తూరు గ్రామంలో అన్నమయ్య డ్యాం తెగి వరదలకు దెబ్బతిన్న గ్రామాలను పరిశీలించబోతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇక, భారీ బందోబస్తు మధ్య ఆయన పర్యటన కొనసాగనుంది..
పవన్ కల్యాణ్ పర్యటన షెడ్యూల్..
* ఉదయం 8 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి విమానంలో బయల్దేరనున్న పవన్.. 9 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు..
* రేణిగుంట ఎయిర్‌పోర్ట్ నుంచి నుంచి రోడ్డు మార్గంలో అన్నమయ్య జిల్లా కోడూరు నియోజకవర్గంలోని మైసూరాపల్లికి పయనం..
* ఉదయం 10 గంటల రైల్వే కోడూరు మండలంలోని మైసురావారిపల్లెలో గ్రామ సభలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం..
* ఉదయం 11.30 గంటల వరకు మైసూరావారిపల్లె నుంచి రాజంపేట మండలం పులపత్తూరు గ్రామానికి రోడ్డు మార్గంలో పయనం..
* మధ్యాహ్నం 12.30 గంటలకు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో దెబ్బతిన్న పులపత్తూరు గ్రామాన్ని పరిశీలించనున్న డిప్యూటీ సీఎం..
* మధ్యాహ్నం 1.45కి పులపత్తూరు నుంచి రోడ్డు మార్గంలో రాజంపేట ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ చేరుకోనున్న పవన్..
* మధ్యాహ్నం 2.05 నుంచి 3.05 వరకు గెస్ట్ హౌస్ లో విశ్రాంతి..
* మధ్యాహ్నం 3.05కి రాజంపేట గెస్ట్ హౌస్ నుంచి రోడ్డు మార్గంలో రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కి పయనం..
* రేణిగుంట నుంచి విమానంలో 4.40కి గన్నవరం బయల్దేరనున్న డిప్యూటీ సీఎం