స్పేస్ అనీమియా అనేది ఒక రకమైన రక్తహీనత. అంతరిక్ష యాత్రల సమయంలో మైక్రోగ్రావిటీకి ఎక్కువ కాలం గురికావడం వల్ల ఇది వస్తుంది. రేడియేషన్ నుండి వచ్చే ఆక్సీకరణ ఒత్తిడి ఎర్ర రక్త కణాలను (RBCs) దెబ్బతీస్తుంది. ఇది రక్తహీనతకు దారితీస్తుంది. సాధారణంగా, మానవ శరీరం సెకనుకు 2 మిలియన్ ఎర్ర రక్త కణాలను సృష్టిస్తుంది. అలాగే నాశనం చేస్తుంది. అయితే మైక్రోగ్రావిటీ కారణంగా వ్యోమగాములు సెకనుకు మూడు మిలియన్ల RBCలను కోల్పోతారని నిపుణులు చెబుతున్నారు.