మద్యం తాగినవారిని గుర్తించేందుకు బ్రీత్ ఎనలైజర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో అప్పటికప్పుడే ఫలితాలు వస్తాయి. కానీ గంజాయి, డ్రగ్స్ తీసుకున్న వారిని గుర్తించాలంటే మూత్ర, రక్త, లాలాజల నమూనాల పరీక్షలు చేసి సైకోయాక్టివ్ కాంపౌండ్‌ను కనిపెట్టాలి. ఈ నమూనాలు తీసుకొని ల్యాబ్‌లలో పరీక్షలకు పంపితే కొన్ని రోజుల తరువాత ఫలితాలు వస్తాయి. దీంతో టీజీన్యాబ్ ఆధునిక డ్రగ్స్ టెస్టింగ్ కిట్లను వినియోగిస్తోంది. మూత్ర నమూనాల పరీక్షలతో రెండే నిమిషాల్లో ఫలితమొస్తోంది