గ్రామాల సమగ్ర అభివృద్దే ధ్యేయంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో స్వర్ణ గ్రామ సభలు నిర్వహించాము. పక్కా ప్రణాళికతో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నాము. రానున్న రెండేళ్లలో అన్ని గ్రామాల్లో డ్రెయిన్లు, సిమెంట్ రోడ్లు పూర్తి స్థాయిలో ఏర్పాటుకు కృషి చేస్తాము. ఉపాధి హామీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో అన్ని సమస్యలు పరిష్కరించడంతో పాటు పల్లెల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాము.