నేపాల్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో సామాజిక మాధ్యమం టిక్‌టాక్‌పై నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే తమ దేశంలో టూరిజాన్ని ప్రమోట్ చేయడంతో పాటు, విద్యావ్యవస్థ అభివృద్ధికి తోడ్పాటు, డిజిటల్ లిటరసీపై పెట్టుబడులు తదితర షరతులు విధించింది. ఇక భారత్‌లో జూన్ 29, 2020న చైనా కంపెనీ ByteDance ఆధ్వర్యంలో నడిచే టిక్‌టాక్‌ను భద్రతా కారణాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.