ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13326 గ్రామ పంచాయతీలలో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామ పంచాయతీలను సందర్శించి అక్కడ నిర్వహిస్తున్న గ్రామ సభలను పరిశీలించిన నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారు. తొట్టంబేడు మండలం లోని కన్నలి పంచాయతీ, శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలెం, ఏర్పేడు మండలం ఏర్పేడు పంచాయతీ గ్రామ సభల నిర్వహణను వినుత గారు పరిశీలించి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ఏర్పాటు చేసిన ఉద్దేశాన్ని వివరించి, గాంధీజీ గారు కన్న గ్రామ స్వరాజ్యం పవన్ కళ్యాణ్ గారి సారధ్యంలో, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సాధ్యం అవుతుందని తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని గ్రామస్తులు, రైతులు గ్రామ అభివృద్దికి ఉపయోగించుకోవాలని వినుత గారు ప్రజలను కోరారు. గ్రామ సభల్లో తప్పక గ్రామంలోని ప్రజలు పాల్గొని వారి సమస్యలను, అభివృద్ది కార్యక్రమాల గురించి చర్చించాలని తెలిపారు