అచ్యుతాపురం సెజ్‌లో జరిగిన ప్రమాదంలో గాయపడి స్థానిక ఉషాప్రైమ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గురువారం పరామర్శించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యసేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ ఫార్మాసిటీలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి క్షతగాత్రులను పరామర్శించేందుకు అనకాపల్లి ఉషాప్రైౖమ్ ఆస్పత్రికి హాజరుకానున్నారని తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఘటన జరిగితే మంత్రులు, అధికార పార్టీ నాయకులు పట్టించుకోలేదని ఆరోపించారు. క్షతగాత్రులను పరామర్శించిన వారిలో మాజీ మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, బూడి ముత్యాలనాయుడు, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మాజీ ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతి, వైసీపీ పట్టణశాఖ అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజు ఉన్నారు.