గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.4కోట్లు ఖర్చు పెట్టి కర్నూలు లో కోల్డ్ స్టోరేజీ ప్లాంటు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్లాంటు వల్ల వందలాది మంది రైతులకు ఉపయోగంగా ఉంటుంది. కోల్డ్ స్టోరేజీ ప్లాంటు ఏర్పాటైతే.. మిరప, పసుపు తదితర ఆహారోత్పత్తులను వాణిజ్య పంటల ఉత్పత్తులను మార్కెట్‌లో ధర అందనప్పుడు రైతులు ఇక్క డ భద్రపరుచుకోవచ్చు. మార్కెటింగ్ శాఖ కమిషనర్ విజయ సునీత బుధవారం కర్నూలు మార్కెట్ యార్డులో పర్యటించిన సమయంలో పనులు మధ్యలో ఆగిపోయిన కోల్డ్ స్టోరేజీ ప్లాంటు పనులను వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు మొరపెట్టుకున్నారు. మార్కెటింగ్ శాఖ డీఈఈ సుబ్బారెడ్డి, సెలక్షన గ్రేడ్ సెక్రటరీ గోవిందు, సూపర్‌వైజర్లు కేశవరెడ్డి, నాగేష్, శివన్న, తదితరులు ఈ ప్లాంటు ఏర్పాటైతే.. ప్రకృతి వైపరీ త్యాల వల్ల ధరలు లేని సమయంలో రైతులు పంట ఉత్పత్తులను తక్కువ అద్దెకే నిల్వ చేసుకోవచ్చని కమిషనర్ దృష్టికి తెచ్చారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ఈ ప్లాంటును నిరూపయోగంగా ఉంచడం సమం జసం కాదని కమిషనర్ పేరొన్నారు. వెంటనే కోల్డ్ స్టోరేజీ ప్లాంటును విని యోగంలోకి తెచ్చి రైతులకు ప్రయోజనం తెస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ ప్రకటనతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.