రామచంద్రపురం నియోజవర్గం ద్రాక్షారంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆంధ్రప్రదేశ్ గ్రామ సభకు మంత్రి సుభాష్ గారు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గ్రామసభ ద్వారా పంచాయతీలో ఉన్న సమస్యలను పరిష్కరించుకొని ఉపాధి హామీ పథకం వ్యవసాయ అనుబంధ పనులు నీటి సంరక్షణ పనులు మౌలిక సదుపాయాలు కల్పన మొదలైనవి గ్రామసభ ద్వారా పరిష్కరించుకోవచ్చని అదేవిధంగా అభివృద్ధి సంక్షేమం ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు సారధ్యంలో స్వర్ణాంధ్రప్రదేశ్‌గా రూపుదిద్దుకుంటుందని పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి ఆలోచనలతో ఎన్డీఏ కూటమి ద్వారా రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు ఈ సమావేశానికి ద్రాక్షారం సర్పంచ్ అరుణ గారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రముఖులు కూటమి నాయకులు కార్యకర్తలు పంచాయతీ సిబ్బంది మొదలైన వారు పాల్గొన్నారు.