శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్థానంలో పేరాడ తిలక్‌ను వైయస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డి నియమించారు. నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ వ్యవహారాలను పేరాడ తిలక్ సమన్వయ పరుస్తారని పేర్కొన్నారు.