గొంతువాపుతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఇంటర్ విద్యార్థి గురువారం మృతి చెందాడు. పాడేరు పరిధిలోని పెదబయలు గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి పాంగి జాన్(16)కు ఈనెల 12న గొంతువాపు వచ్చింది. దీంతో కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులను పిలిపించి విద్యార్థిని అప్పగించారు. గ్రామంలో వైద్యం చేయించిన తల్లిదండ్రులు నయం కాకపోవడంతో రెండు రోజుల క్రితం పాడేరు జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం విద్యార్థి పాంగి జాన్ మృతి చెందాడు. గొంతులో క్యాన్సర్ తరహా కాయ ఏర్పడడం వల్లే విద్యార్థి మృతి చెందాడని భావిస్తున్నారు.