వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఏలూరు మున్సిపల్ హెల్త్ ఆపీసర్ మాలతి అన్నారు. చిట్టివలస పాకలు, రైల్వే ట్రాక్రోడ్డు, ఉషాపిక్చర్స్ రోడ్డు ప్రాంతాల్లో స్ర్పేయింగ్, ఫాగింగ్, ఆయిల్ బాల్స్ వేశారు. మలేరియా ఇన్స్పెక్టర్ వేణు గోపాలస్వామి, శానిటరి ఇన్స్పెక్టర్ అప్పారావు, నాయకులు సుధారాణి, సురేష్, ఆశావర్కర్లు, ఆరోగ్య కార్యదర్శులు పాల్గొన్నారు.