పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన బొబ్బిలి మండలంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన సీఐ కటకం సతీష్‌కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బొబ్బిలి మండలం విజయపురి గ్రామానికి చెందిన లావుడి బుచ్చయ్య, జర్ని గౌరమ్మ(45) దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 17న భర్యాభర్తలు ఇద్దరూ కలిసి మద్యం తాగారు. ఈ సమయంలో మద్యం ఇంకా కావాలంటూ జర్నిగౌరమ్మ భర్తతో గొడవపడింది. ఇక చాలంటూ భర్త మందలించాడు. దీంతో కలత చెందిన గౌరమ్మ అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన భర్త బుచ్చయ్య, బంధువులు కలిసి ఆమెను స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. ఆమె పరిస్థితి విష మంగా ఉండడంతో విజయనగరం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గౌరమ్మ గురువారం తెల్లవారుజామున కన్నుమూసింది. ఎస్‌ఐ టి.శ్రీహరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించిన అ నంతరం బంఽధువులకు అప్పగించారు. మృతురాలకి పిల్లలు లేరు.