గుంటూరు జిల్లా వడ్లమూడిలోని డీవీసీ ఆస్పత్రి, పరిశోధన కేంద్రం 6వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. హాస్పిటల్ ప్రాంగణంలోని స్వర్గీయ ధూళిపాళ్ల వీరయ్య చౌదరి గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.పొన్నూరు శాసనసభ్యులు శ్రీ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్గారితో కలసి ఆస్పత్రిలోని వైద్య సౌకర్యాలు, వసతులు పరిశీలించాను. ఆస్పత్రిలో కొత్తగా నిర్మించిన కార్డియాక్ ఐసీయూను ప్రారంభించారు.ఆరేళ్లుగా 2 లక్షలకుపైగా ఓపీ సేవలు, వేలాది గుండె ఆపరేషన్లు, శస్త్రచికిత్సలతో కొనసాగుతున్న డీవీసీ ప్రస్థానం ప్రశంసనీయం. గ్రామీణులు, పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉండాలనే సంకల్పంతో గుంటూరు, తెనాలి పట్టణాల మధ్యలో హాస్పిటల్కట్టి, లాభాపేక్ష చూసుకోకుండా వైద్యసేవలు అందిస్తున్న యాజమాన్యానికి అభినందనలు. ప్రజారోగ్య పరిరక్షణలో మరింతగా కృషిచేయాలని కోరుకుంటూ డీవీసీయాజమాన్యానికి, వైద్యులకు, వైద్య సిబ్బందికి వార్షికోత్సవ శుభాకాంక్షలు.