ఎన్టీఆర్ జిల్లా, తిరువూరులో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రతి సవాళ్లు.. ప్రతిసవాళ్ల నేపథ్యంలో తిరువూరు పట్టణం బోసుబొమ్మ వద్దకు ఈరోజు ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చేరుకున్నారు. గత ఐదేళ్ల పాలనలో వైసీపీ నేతలు ఇసుక, గ్రావెల్ అక్రమంగా తరలించారంటూ సాక్షి మీడియాకి, వైసీపీ నేతలకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే సవాల్‌ను స్వీకరించిన వైసీపీ నేతలు.. టీడీపీ, వైసీపీ పార్టీ నేతలు బహిరంగంగా చర్చించేందుకు బోసుబొమ్మ సెంటర్‌కు వెళ్లేందుకు వైసీపీ నాయకులు సిద్ధమయ్యారు. వైసీపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు ఉన్నారు.