ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా వైసీపీ ప్రభుత్వం మార్చిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆరోపణలు చేశారు. ప్రజల ఆదరాభిమానాలు ఉంటేనే రాజకీయాల్లో గెలుపు సాధ్యమవుతుందని తెలిపారు. ఆదర్శ రాజకీయాలు చేసే నాయకుల్లో ధూళిపాళ్ల ముందుంటారని తెలిపారు. కోవిడ్ సమస్యలను అధిగమించి డీవీసీ హాస్పిటల్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తుందని తెలిపారు. ఆరేళ్లుగా పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో డీవీసీ హాస్పిటల్ ముందుందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. మానసిక సమస్యలు ఉన్నవారు సమాజానికి ప్రమాదకరమని అన్నారు. ప్రతి వ్యక్తి ప్రాణాలు కాపాడేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశామని తెలిపారు. చితికిపోయిన రాష్ట్రాన్ని కాపాడటానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఐదేళ్లలో ఖచ్చితమైన అభివృద్ధి మార్క్‌ను చూపిస్తామని అన్నారు.