ఇంట్లో ఎండిపోయిన కొబ్బరిని పారేయకుండా, స్వచ్ఛమైన, సువాసనగల కొబ్బరి నూనెను సులభంగా తయారు చేసుకోవచ్చు. మార్కెట్ నూనెలతో పోలిస్తే ఇది ఆరోగ్యకరం. 2 కప్పుల ఎండుకొబ్బరి ముక్కలను గోరువెచ్చని నీటితో మెత్తగా గ్రైండ్ చేసి, పాలు తీసి, మందపాటి గిన్నెలో మరిగించాలి. నూనె వేరుపడిన తర్వాత చల్లార్చి, గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనె వంటకు, జుట్టు, చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది. తయారీలో మంట ఎక్కువగా ఉండకుండా, పూర్తిగా చల్లారిన తర్వాతే నిల్వ చేయాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa