ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏపీకి తీరని అన్యాయం చేసిందని ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు. భవిష్యత్తులో రాష్ట్రంలో బీజేపీ ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగాలంటే సభ్యత్వాలు ఎంతో అవసరమని తెలిపారు. సభ్యత్వ నమోదును నిర్లక్ష్యం చేయకుండా ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడి పని చేసే వారిని, పార్టీ పైన ఆసక్తి ఉన్నవారిని సభ్యులుగా తీసుకోవాలని కోరారు. ప్రజలకు బీజేపీ పార్టీ ప్రయోజనాలను, గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయలను వివరించి బీజేపీ పట్ల ఆకర్షితుల ఏవిధంగా నాయకుల కృషి చేయాలని అన్నారు.తాను విశాఖ జిల్లాలోనూ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని ఎంపీ సీఎం రమేష్ వెల్లడించారు.