విశాఖలో ఊహించని పరిణామాలను చూస్తున్నామని.. పరిశ్రమల్లో ప్రమాదాలు పునరావృతం కాకూడదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు తెలిపారు. ఫార్మా ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి బాధితులను పరామర్శించారని అన్నారు. ఫార్మా కంపెనీలో ప్రమాదాలను సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ గా తీసుకున్నారని చెప్పారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై నిన్న రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలు జరిగాయని సోము వీర్రాజు వివరించారు.గత ఐదేళ్ల పరిపాలనపై అవగాహన లేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలింరని అన్నారు. వైసీపీ ప్రభుత్వం గ్రామపంచాయతీలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రూ.800 కోట్లను గ్రామపంచాయతీలకు విడుదల చేసిందని తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి నీరుగార్చారని సోము వీర్రాజు ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వానికి గ్రామీణ అభివృద్ధిపై అవగాహన లేదన్నారు. విశాఖపట్నం అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం చురుకైన పాత్ర పోషిస్తుందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి రూ.500 కోట్లు పెట్టి విలాసవంతమైన భవనం నిర్మించుకున్నారు తప్ప విశాఖను అభివృద్ధి చేయలేదని సోము వీర్రాజు తీవ్ర విమర్శలు గుప్పించారు.