అచ్యుతాపురం ప్రమాద ఘటనకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై కార్మిక శాఖ మంత్రి సుభాష్ మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... అచ్యుతాపురం సెజ్‌లో ఫార్మా ప్రమాదం ఘటనను మాజీ సీఎం జగన్ రాజకీయం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ‘‘జగన్‌కు ఇదే నా సవాల్’’.. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్‌కు ఏనాడు కార్మికుల సంక్షేమం పట్టలేదు అని అన్నారు. అసలు కార్మికుల ప్రాణాలపై ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించిందన్నారు. గత వైసీపీ పాలనలో పారిశ్రామిక ప్రమాదాల్లో కార్మికులు మరణించినప్పుడు సీఎం హోదాలో జగన్ ఏ రోజు తక్షణం పరామర్శకు రాలేదని గుర్తుచేశారు. భవనిర్మాణ కార్మికులను జగన్ వేధించారని.. వారి నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. అలాంటి జగన్ ఇప్పుడు కార్మికుల బాగోగుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందంటూ మంత్రి సుభాష్ వ్యాఖ్యలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa