ఫార్మా ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని జగన్మోహన్ రెడ్డి అనడం దుర్మార్గమని బీజేపీ శాసనసభా పక్షనేత, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. ప్రమాదాన్ని జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందని తెలిపారు. బాధితులు ఆశ్చర్యపోయే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షతగాత్రులను పరామర్శించి నష్టపరిహారం అందజేశారని అన్నారు. పరిశ్రమలలో ప్రమాదాల పురావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష సమావేశం నిర్వహిస్తుందని విష్ణుకుమార్ రాజు చెప్పారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి అభ్యర్థి బరిలో లేకపోవడంతో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎన్నికయ్యారని అన్నారు. బొత్స కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలిపితే హర్షించే వాళ్లమని చెప్పారు. జగన్ గత ఐదేళ్లలో అన్నింటిలోనూ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజాధనంతో రుషికొండలో విలాసవంతమైన భవనాన్ని నిర్మించారని విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు.రుషికొండా భవనలు వివరాలు తెలపమని ఏపీటీడీసీకి త్వరలో లేక రాస్తానని చెప్పారు. కాంగ్రెస్ దేశానికి చేస్తోన్న దుర్మార్గాన్ని ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. జమ్మూ& కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కాశ్మీర్‌లో రెండు జెండాలు ఉండాలని కోరుకుంటోందని అన్నారు. ఇది దేశప్రజలెవ్వరూ హర్షించరని అన్నారు. వారితో రాహుల్ గాంధీ కలిసి ఎన్నికలకు వెళ్లడం దుర్మార్గమని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.