శ్రీ కృష్ణుడి మహిమాన్విత పుణ్యక్షేత్రాల్లో గుజరాత్‌లోని ద్వారక ఒకటి. కృష్ణుడు పరిపాలించిన ద్వారకలో వేల సంవత్సరాల క్రితం నిర్మించిన ద్వారకాధీశుడి దేవాలయాన్ని దర్శించుకోవచ్చు. ఈ ఆలయ ప్రధాన విగ్రహం నల్ల పాలరాతితో చెక్కి ఉంటుంది. కౌస్తుభ మణి, లక్ష్మీదేవి బహుమతిగా ఇచ్చిన దండతో ఈ విగ్రహాన్ని అలంకరించారు. ఏటా జన్మాష్టమికి ఇక్కడ నిర్వహించే వేడుకలు చూసేందుకు లక్షలాది భక్తులు తరలి వస్తారు.